బలగం హైదరాబాద్:

సీఎం రేవంత్ రెడ్డి పీఆర్వోగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బొల్గం శ్రీనివాస్ నియామకమయ్యారు. ప్రస్తుతం వెలుగు దిన పత్రిక లో ఛీప్ బ్యూరో గా పని చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారయణపూర్‌కు చెందిన బొల్గం శ్రీనివాస్ 1997 లో ఈనాడు దినపత్రికల్లో కంట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యి అంచెలంచలుగా.. ఎదిగారు. బొల్గం శ్రీనివాస్ వివాదరహితుడు.. సౌమ్యుడు.. ఉత్తమ జర్నలిస్టుగా అవార్డు సైతం దక్కించుకున్నాడు. సాక్షిలో పని చేస్తున్న కాలంలో 2008,2010 మధ్య కాలానికి గ్రామీణ జర్నలిజం విభాగంలో ఉత్తమ జర్నలిస్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అవార్డుతో పాటు రూ.రెండు లక్షల నగదు రివార్డును కూడా అందజేసింది. 1997 లో ఎల్లారెడ్డిపేట మండల ఈనాడు కంట్రిబ్యూటర్‌గా ఈ తర్వాత సూర్యాపేట, అనంతపూర్, ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌గా ఇదే పత్రికలో పని చేశారు. సాక్షి అవిర్బావం నుంచి 2011 వరకు కరీంనగర్, వరంగల్ ఛీప్ బ్యూర్ గా విధులు నిర్వహించారు. తర్వాత వి6 ఛానెల్ వారు నెలకొల్పిన వెలుగు దినపత్రిక లో ఛీప్ బ్యూర్‌గా పని చేస్తున్నారు. బొల్గం శ్రీనివాస్ జర్నలిస్టుగా అనేక కథనాలు.. ఇన్వెస్ట్‌గేషన్ రిపోర్టింగ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక సీఎం రేవంత్ రెడ్డి తన పీఆర్వోగా నియమించుకున్నారు. సీఎం పీఆర్వోగా బొల్గం శ్రీనివాస్ నియామకం కావడంతో పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. సొంత జిల్లా ఐన రాజన్న సిరిసిల్ల జిల్లాలో బొల్గం నియామకంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు. అభినందనలు తెలిపారు.
