బలగం టీవి , ,తంగళ్ళపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబోతున్న ప్రెస్ క్లబ్ కు బోర్ ను జెడ్పిటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పిటిసి పుర్మాని మంజుల మాట్లాడుతూ రెండు లక్షలతో ప్రెస్ క్లబ్ కు బోరు, మోటార్ మంజూరు చేసి బోరును ప్రారంభించామని తెలిపారు. మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మించుకోవడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆంజనేయులు, కార్యదర్శి శ్యామ్, వెంగళ శ్రీనివాస్, పిల్లి శ్రీనివాస్, ప్రణయ్, రాజశేఖర్, శ్రీనాథ్ రావు, సాగర్, పరశురాములు, దినేష్ క్లబ్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.