సిరిసిల్ల న్యూస్: వేములవాడ నియోజకవర్గం:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోకవర్గం కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన యాదవ సంఘం అధ్యక్షుడు లంబ మల్లయ్య, గోసంగి సంఘం అధ్యక్షుడు సనుగుల తిరుపతి, కురుమ సంఘం అధ్యక్షుడు దాప పర్శరాములు, బర్మ మహేష్ లతో పాటు సంఘం సభ్యులు సుమారు 60మంది గురువారం బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీలో చేరిన సంఘం సభ్యులకు లక్ష్మీ నరసింహా రావు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్య యాదవ్, సీనియర్ నాయకుడు న్యాలకొండ రాఘవ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు జీవన్ గౌడ్, ఉప సర్పంచ్ చేకూట మల్లేశం, ఆయా సంఘాల సభ్యులు సనుగుల సాయి, జలందర్, యాదగిరి, మల్లయ్య, లక్ష్మణ్, దుర్గం మహేష్, గంగాధర్, రమేష్, రవీందర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
