బలగం టీవీ, హైదరాబాద్:
ఇస్లాం మతస్తులు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభ దినం సందర్భంగా, ముస్లిం సోదర సోదరీమణులకు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
పవిత్ర ఉపవాస దీక్షలతో, ప్రత్యేక ప్రార్థనలతో, దైవభక్తితో సాగే రంజాన్ మాసంలో ఆధ్యాత్మికత, భక్తి భావన వెల్లివిరుస్తుందని, రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ నగరం గంగా జమున తహజీబ్‌కు దర్పణంగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. రంజాన్ మాస ఉపవాస దీక్షల సందర్భంగా ప్రజల నడుమ శాంతి సామరస్యాలు, సౌభ్రాతృత్వ భావనలు మరింతగా పెంపొందాలని ఆ దేవుని కృప ప్రజలందరి మీద ఉండాలని కేసీఆర్ అకాంక్షించారు.
