ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..

0
99

బలగం టీవీ, హైదరాబాద్:

ఉగ్రవాదం అంతం కావాల్సిందే

భారత సైన్యం ప్రదర్శించిన అసాధారణ సైనిక పాటవంపై ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానని కేసీఆర్ తెలిపారు. ఉగ్రవాదం మరియు ఉన్మాదం ఏ రూపంలో, ఏ దేశంలో ఉన్నా, అది మానవాళికి నష్టం కలిగించేదేనని, ఎలాంటి లాభం చేకూర్చదని ఆయన అన్నారు.

ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రపంచంలోని సానుకూల శక్తులన్నీ ఐక్యమై, ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తేనే శాంతి, సామరస్యాలు నెలకొంటాయని కేసీఆర్ పేర్కొన్నారు. భారత సైన్యం వీరోచితంగా దాడులు చేసినంత సమర్థవంతంగా, అప్రమత్తంగా ఉంటూ దేశ రక్షణలో ఎవరికీ తీసిపోమని నిరూపించాలని, అందుకు అవసరమైన శక్తి, సామర్థ్యాలు సైన్యానికి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.

భారత సైన్యం యొక్క ఈ శౌర్యం దేశ ప్రజలందరికీ స్ఫూర్తినిస్తుందని, దేశ రక్షణలో వారి త్యాగాలు ఎప్పటికీ స్మరణీయమని కేసీఆర్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here