బిఆర్ఎస్ భారీ షాక్
బిఆర్ఎస్ కౌన్సిలర్ వంగల దివ్య శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరిక
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆది శ్రీనివాస్
వేములవాడ పట్టణంలోని 17 వ వార్డు కౌన్సిలర్ వంగల దివ్య శ్రీనివాస్ లు బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దివ్య శ్రీనివాస్ లకు ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ..అందరి బాధలు తెలిసిన నాయకుడు శ్రీనివాస్ అని వారు అన్నారు.
నాలుగు సార్లు ఓడిన బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ ను గెలిపించుకోడానికి తాము కాంగ్రెస్లో చేరుతున్నట్లు కౌన్సిలర్ దంపతులు దివ్య శ్రీనివాస్ తెలిపారు.