సిరిసిల్ల న్యూస్:
సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండలం కస్బె కట్కూర్ లో బీఆర్ఎస్ పార్టీ తరుపున సర్పంచ్ ల ఫోరం తంగళ్లపల్లి మండలాధ్యక్షులు వలకొండ వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌ను అత్యధిక మేజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు గజభీంకార్ రాజన్న, బీఆర్ఎస్ నాయకులు జూపల్లి వెంకట్రావ్, ఎంపిపి ఉపాధ్యక్షులు అంజయ్య, శ్రీవర్ధన్, మాజీ సర్పంచ్ వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.