బలగం టివి,,ఎల్లారెడ్డిపేట
సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్

బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పు చూపిస్తూ చెప్పుతో కొడతా నా కొడకా అంటూ మాట్లాడిన మాటలను ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాల్సిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ….బిడ్డ బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మీ ప్రభుత్వం ఓడిపోయిన నీకు మాత్రం బుద్ధి వస్తాలేదు.పిచ్చికుక్క లెక్క మాటలు మాట్లాడటం ఆపు లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిన్ను చెప్పు తెగేదాకా నీ తోలు ఊడేదాకా కొడతారు బిడ్డ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు తక్షణమే సీఎం కు క్షమాపణ చెప్పి ముక్కు నాలకు రాయాలని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం బిడ్డ జాగ్రత్త,,,
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసయ్య ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ,పందిరి లింగం గౌడ్, చెన్ని బాబు, రామచంద్రం, సంతోష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కొత్తపెళ్లి దేవయ్య, గంట అంజయ్య, రఫీక్ బుచ్చయ్య గౌడ్ ,రామ్ రెడ్డి, బిపేట రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.