వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం బీ.ఆర్.ఎస్. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
+++++++++++++++
అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు యుద్ధ సైనికుల్లాగా కష్టించి పని చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో వినోద్ కుమార్ బుధవారం విస్తృతంగా పర్యటించారు.
అందులో భాగంగా బుధవారం కథలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ పార్టీ క్యాడర్ యావత్తు ఎక్కడికక్కడ వారియర్స్ లాగా మారి ప్రతి ఓటర్లు కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుకు ఓటు వేసేలా కృషి చేయాలని సూచించారు.
స్వరాష్ట్రం తెలంగాణ సిద్ధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం … యావత్ దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేసిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
సమైక్య పాలనలో దగాపడ్డ తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని, సీఎం కేసీఆర్ గొప్ప విజన్ వల్లనే ఇది సాధ్యమైందని వినోద్ కుమార్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ బిజెపి నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని వినోద్ కుమార్ పార్టీ క్యాడర్ కు సూచించారు.
24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతి ఓటరుకు మరోసారి గుర్తుచేయాలని వినోద్ కుమార్ పార్టీ క్యాడర్ కు సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీ.ఆర్.ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను ప్రతి ఓటరుకు వివరించి చెప్పాలని వినోద్ కుమార్ కోరారు.
వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావును భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు పార్టీ క్యాడర్ కృషి చేయాలని వినోద్ కుమార్ అన్నారు.
ఈ సమావేశంలో మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి, ఎంపీపీ రేవతి గణేష్, జెడ్పిటిసి నాగం భూమయ్య, పార్టీ మండల అధ్యక్షులు గంగా ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగాధర్, సీనియర్ నాయకుడు జోగిన్ పల్లి అజిత్ రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల పార్టీ ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.