బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్
- బిఆర్ఎస్ నాయకుల్లారా ఖబర్దార్
- సభ్య సమాజం తలదించుకునేలా బీఆర్ఎస్ నాయకుల మాటలు
- ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడే భయపడలేదు.. గిప్పుడు భయపడుతమా
- తెలంగాణ ఉద్యమంలో నేను” జై తెలంగాణ” అంటే నువ్వు లాగులేసుకొని తిరుగుతున్నవు
- మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టోనీ
ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ.. కేకే మహేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి నీదా…కేకే గురించి మీ కేసీఆర్ ను కేటీఆర్ ను అడుగు అని,మీ ప్రభుత్వంలో జరిగిన కబ్జాలకు, దోపిడీలకు,కమిషన్ ల కక్తృతి అని, మమ్మల్ని కాపాడు మహాప్రభో అంటూ కేకే మహేందర్ రెడ్డి చుట్టూ కాళ్ళు మొక్కుకుంటూ తిరుగుతున్నారు మీ నాయకులు అని అన్నారు.
బేషరతు బహిరంగ క్షమాపణ చెప్పాలని,
ఒక సంస్కారవంతునిలాగా మాట్లాడు అని నీ జిల్లేల్ల గ్రామంలో పది సంవత్సరాలు సర్పంచ్ గా ఏం వెలగ బెట్టినవొ చెప్పు అని,బాత్రుంల పైసలు దొబ్బింది నిజం కాదా గ్రామంలో నీ అరాచకం ఎవరికి తెలువందా కేటీఆర్ పర్యటనలో క్రషర్ వల్ల నష్టపోతున్న అని నిలదీసిన రైతు,కేటీఆర్ ఎనలేని సేవలు చేయలేదు. ఇక్కడి సంపదను దోచుకున్నాడని, సభ్య సమాజం తలదించుకునేలా విచక్షణా కోల్పోయి కేటీఆర్ మెప్పు కోసం కేకే పై కారు కూతలు కుస్తావా అని,ఎల్లారెడ్డిపేట మండలం లో చిన్నారి పై అఘహిత్యనికి పాల్పడిన మీ నాయకుడి పై ఏం చర్యలు తీసుకున్నారని, కేటీఆర్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారా అని అన్నారు. కేకే మహేందర్ రెడ్డికి రావాల్సిన టికెట్ మీ నాయకుడు గద్దలాగ తన్నుకోపోయింది తెల్వాద అని,కేకే మహేందర్ రెడ్డికి జరిగిన అన్యాయం విషయంలో కేసీఆర్,కేటీఆర్, హరీష్ రావు లు తెలుసు అని అన్నారు.
సిరిసిల్ల పట్టణం లోని దళిత గిరిజన మైనార్టీ హాస్టల్లో జరిగిన ఆఘాయిత్యానికి ఎవరిని కొట్టాలి, మేం గెలవకోపోయిన ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళకి అండగా ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని, తెలంగాణ ఉద్యమం లో కేటీఆర్ ఏం చేసిండు ..ఆయన కాంట్రిబ్యూషన్ ఎంత అని, మొట్ట మొదటిగా జెండా పట్టీ సబ్బండ వర్గాలను మమేమం చేసి ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి కేకే అని,ఉద్యమం ఉనికిని కాపాడాలని ప్రజలు కేటీఆర్ ను గెలిపిస్తే..మీరు ఆంధ్ర వాళ్లకు తొత్తులుగా మారారని మీరు దొంగ రాజకీయాలు చేసేది అని, మీరా కేకే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడేది అని,మీ ప్రభుత్వ పాలనలో రూ.3500 కోట్ల ఇసుకను తరలించారని ధర్నాలు చేస్తే స్పందించలేరని నేరేళ్ల ఘటనలో ఒక వ్యక్తి చనిపోయిన..దళితులపై తర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎందుకు స్పందించలేదని అప్పుడు ప్రశ్నించనీ మీరు ఇప్పుడూ ప్రశ్నిస్తున్నారాక? అని అన్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను చెప్పడానికి కేటీఆర్ ను కలిసినా అని,జిల్లా ఉద్యమ సమయంలో కేటీఆర్ ను కలిసి జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరించినని తంగళ్లపల్లి మండలంలోని కొన్ని గ్రామాలను మున్సిపల్ చేస్తారంటే.. కలపొద్దని కేటీఆర్ ను కలిసి వినతపత్రం అందజేసినమని,ప్రజా ప్రయోజనాల కోసం కలిసిన తప్ప స్వంత ప్రయోజనాలకు కాదని,తెలంగాణ ఉద్యమ సమయంలో నేను “జై తెలంగాణ” అంటే నువ్వు లాగులు వేసుకొని తిరుగుతున్నవు అని,ప్రజలను హాస్పటల్ లో చేర్పించినట్లు నటించి.. డాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకున్నవ్ అని, అగ్రీకల్చర్ కాలేజీలో భూములు కోల్పోయిన 12 కు కుటుంబాలకు న్యాయం జరగలేదు కానీ నీ భార్య పేరు మీద సర్వే నెంబర్ 633లో 1.27 గుంటల పట్టా పొందిన ముచ్చట వాస్తవం కాదా? మీ పార్టీ నాయకురాలు సరస్వతి ఒకటికి నాలుగు సార్లు ప్రభుత్వ లోన్ తీసుకున్నది వాస్తవం కాదా?, ఆమె 2.20 గుంటల ప్రభుత్వ భూమినీ అక్రమించుకున్నది వాస్తవం కాదా? అని అన్నారు. గత అధికార మదాన్ని ఇప్పుడు చూపిస్తే ఊరుకోమని మీ నాయకుడు మీకు ఇదే నేరిపిస్తున్నాడా? అక్రమ మైనింగ్ ద్వారా క్రషర్ నడిపించి పక్క పొలాల రైతులను ఇబ్బంది పెట్టింది నువ్వు కాదా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తొవ్వనన్న చేసినవా ప్రగతి భవన్ ఊరవతల కట్టి నీ దావతులకి అడ్డాగా మార్చినవ్ అగ్రికల్చర్ కాలేజి నిర్మాణంలో భూమి కోల్పోయిన మీ ఊరి వ్యక్తి మీ వల్ల గుండే ఆగి చనిపోయాడని నా భూమి నాకు ఇప్పియ్యమంటే కుల బహిష్కరణ కేసు పెట్టింది వాస్తవం కాదా అని,అప్పుడు నీళ్లు ఇచ్చారని అడ్డగోలుగా మాట్లాడుతున్న మీరు ఇప్పుడు నీళ్ళు ఎందుకు రావడం లేదో చెప్పాలని,కాలువ నిర్మాణం కోసం రైతు రాజిరెడ్డి కి నష్టపరిహారం ఇస్తానని ఇవ్వలేదని అధికారంలో ఉన్నప్పుడు ఇయ్యలే ఎందుకు? ఇప్పుడు మాత్రం ఇస్తానని అనడం ఏందుకని,ఏది నిజమో..ఏది అబద్దమో తెల్సుకుని మాట్లాడుఅని ఓడిపోయిన ప్రజల మద్యలో.. ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని అన్నారు.
ఈ పాత్రికేయ సమావేశంలో జలగం ప్రవీణ్ (టోనీ),నేరళ్ల నరసింగం గౌడ్,మునగల రాజు,ఎట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పబ్బతి కృష్ణారెడ్డి రాము,పొన్నాల పరుశురాం,అరెపల్లి బాలు,చుక్క శేఖర్,మాందాటి తిరుపతి,జలంధర్ రెడ్డి, బాలసాని శ్రీనివాస్ గౌడ్,సామల గణేష్, కావటి మల్లేశం యాదవ్,రాజేశ్వర్ రావు,బండి పరుశురాం,అనిఫ్,,సుద్దాల శ్రీనివాస్,గుగ్గిళ్ళు అభినయ్, తదితరులు పాల్గొన్నారు.