బలగం టీవీ, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బరితెగించి దౌర్జన్యాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఇవాళ జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల, కౌన్సిలర్ల దౌర్జన్యం, ఇబ్రహీం పట్నం ఎన్నిక స్టే అంశం పై ఈ మేరకు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, వి. శ్రీనివాస్ గౌడ్ మరియు బీఆర్‍ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదును అందజేసింది.

