బలగం టీవి …
సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్ లో నిన్నటి రోజున పాకాల లచ్ఛవ్వ, వయస్సు 53 సం.లు, అనే మహిళ మొన్న రాత్రి నిద్రలోనే ఫిట్స్ వచ్చి మరణించింది. ఆమె భర్త సుబ్బారావు ఉదయం 3:30 గం.లకు లేచి చూడగా లక్ష్మి మరణించి ఉంది.
పాకాల లచ్చవ్వ మరియు సుబ్బారావు భార్య భర్తలు ఇద్దరు కొన్ని సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం సిరిసిల్ల కీ వచ్చారు. కూలి పని చేసుకుంటూ చిన్న అద్దె ఇంట్లో కిరాయి ఉంటూ జీవనం సాగిస్తున్నారు. సుబ్బారావుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సుబ్బారావు బార్య లచ్చవ్వ నే కూలి పని చేసుకుంటూ సుబ్బారావుని పోషిస్తుంది.
గత 5 నెలల క్రితం గాంధీనగర్ లో నీ ప్రస్తుతం కీరాయకు ఉన్న ఇంట్లోకి వచ్చి కిరాయకు అంటున్నారు.
లచ్చవ్వ మరణించిన విషయాన్ని ఆమె భర్త సుబ్బారావు అదే ఇంట్లో వారితో పాటు పక్కన కిరాయకు ఉన్న వారికి తెలుపగా పక్కన ఉన్న వారు హైదరాబాద్ లో ఉన్న వారి కుమారులు మల్లేష్ మరియు అనిల్ లకు సమాచారం ఇవ్వగా వారు స్పందించలేదు. ఈ సమాచారాన్ని వార్డు కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్ గారికి తెలుపగా, నీరజ గారు మునిసిపల్ కమిషనర్ గారికి చనిపోయిన వారి యొక్క స్థితిగతులు తెలిపి ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా అంత్యక్రయలు చేయుటకు సహకరించాలని కొరినారు. కమిషనర్ గారు స్పందించి ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా చేయాలని సూచించారు. BRS నాయకులు గుండ్లపెల్లి పూర్ణచందర్ గారు ఇట్టి అనాథగా ఉన్న పాకాల లక్ష్మి శవానికీ దగ్గర ఉండి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఇట్టి అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమం లో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు అక్కేనపెలి భాస్కర్ మరియు లచ్చవ్వ తో పాటు పని చేసే కూలీలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు
