బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బి గితే ను సిరిసిల్ల లోని ఎస్పీకార్యాలయంలో బీ ఆర్ ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న,సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్,సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ మురళీ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్, సత్తార్ లు పాల్గొన్నారు.