బలగం టివి:
బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహా రావు గారు తన స్వగ్రామమైన కోనరావుపేట మండలంలోని మల్కపేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి, లక్ష్మీ నరసింహా రావు గారి తండ్రి ఆనంద రావు గారు, కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వర్ రావు గారు, చల్మెడ కుటుంబ సభ్యులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు….