ఆటో డ్రైవర్ సోదరులకు బాసటగా నిలిచింది బిఆర్ఎస్ పార్టీ..

0
68

ఆటో కార్మికులకు ‘ఆత్మీయ భరోసా’.. ప్రమాద బీమాకు తోడుగా ఇప్పుడు ఆరోగ్య బీమా

  • బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు

బలగం టీవీ, వేములవాడ:

ప్రమాద బీమాతో కేటీఆర్ ముందడుగు వేస్తే.. దానికి మరొక అడుగు వేస్తానంటూ వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు చల్మెడ ఆరోగ్య భీమా అందజేసి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఉన్న కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, వేములవాడ అర్బన్, రూరల్ మండలాలలో గల ఆటో డ్రైవర్ సోదరులకు ఆరోగ్య భీమా కార్డులను మంగళవారం స్వయంగా చల్మెడ లక్ష్మీనరసింహారావు వారి చేతుల మీదుగా అందజేశారు.

వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రహదారుల గల శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ సోదరులకు ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ.. 6 గ్యారంటీలు అబద్ధపు ప్రచారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆటో డ్రైవర్ల ఉపాధికి అడ్డుకట్ట వేసి మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేసి వారి జీవనోపాధిని ఆగమ్య గోచరంగా మార్చడంతో ఆటో డ్రైవర్లు తమ ఆటోలకు నెల నెల వాయిదాలు కట్టడానికి కూడా వారి కష్టం కావడంతో వారి కష్టాన్ని చూసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గొప్ప ఆలోచనతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆటో డ్రైవర్లకు ప్రమాద భీమను ఉచితంగా పార్టీ తరఫున అందజేశారు. ఇటీవల కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించి పలువురు ఆటో డ్రైవర్ అన్నలకు కార్డులను గ్రూప్ ఇన్సూరెన్స్ చేసి అందజేశారు. దీనికి మరింత తోడ్పాటు అందించడమే కాకుండా నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్ సోదరుల ఆరోగ్యం బాగుండాలని దృఢ సంకల్పంతో వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ ద్వారా వారికి జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ అందించి వారికి ఆరోగ్య భీమాను చేసి ఆత్మీయ భరోసా పేరిట డ్రైవర్ సోదరులతో కార్యక్రమం నిర్వహించి కార్డులను అందజేశారు.. సందర్భంగా వారు మాట్లాడుతూ నాకు ఇద్దరు బిడ్డలు చిన్నప్పుడు వాళ్లను ఒక ఆటో లో స్కూల్ కి పంపించేవాడిని… అప్పుడు ఆటో డ్రైవర్ ఎంతో విశ్వాసంతో నా బిడ్డలను పాఠశాల వరకు పంపించి మళ్లీ తిరిగి తీసుకొచ్చేవాడు. ఆటో డ్రైవర్ అంటేనే విశ్వసనీయత కూడిన వ్యక్తిగా మన కుటుంబ సభ్యుడిగా ఉన్న గొప్ప వ్యక్తి అని అన్నారు. వారికి నా వంతుగా ఆరోగ్య బీమా అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఒక గైడ్ గా వ్యవహరించి వారిని సురక్షితంగా రాజన్న ఆలయం వరకు తీసుకొచ్చే వ్యక్తి ఆటో డ్రైవర్ సోదరుడని, అలాగే వారు ప్రయాణం చేసే సమయంలో నగదు కానీ సెల్ ఫోన్లు కానీ ఇతర సామాన్లు ఏదైనా మర్చిపోతే వారికి తిరిగి ఇచ్చి వారి నిజాయితీని కూడా చాటుకున్న ఘనత మన వేములవాడ ఆటోవాలలు అని చెప్పవచ్చు అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ ఆటో యూనియన్ అధ్యక్షులు బోల్లి రామ్మోహన్, జిల్లా అధ్యక్షులు ఆలె శ్రీనివాస్, బిఆర్టియు అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్, ఏనుగు మనోహర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, రామతీర్థపు రాజు, నిమ్మ శెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి చందు, నరాల శేఖర్, జోగిని శంకర్, మండల అధ్యక్షులు గోస్కుల రవి, మల్యాల దేవయ్య, నాయకులు నీలం శేఖర్, కొండ కనకయ్య, వాసాల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, భారీ సంఖ్యలో ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here