బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ఎండిపోతున్న రైతన్నల పంట పొలాలను కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నీళ్లను విడుదల చేయాలని లేకుంటే సాగునీటి శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంటపొలాలకు నీటిని విడుదల చేసే విషయంలో ముందుకు కదిలింది. మొన్న సిరీసిల్లాలో ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించిన అనంతరం కేటీఆర్, మల్కపేట రిజర్వాయర్ పరిధిలో నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి 48 గంటల గడువు విధించిన ఆ కేటీఆర్ హెచ్చరిక నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ విడుదల అంశంలో చర్యలు ప్రారంభించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని మల్కపేట మరియు రంగనాయక సాగర్ నుండి నీరు వదలాలని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీతో ఫోన్లో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,. 48 గంటల్లో నీళ్ళు విడుదల చేయకపోతే ధర్నా చేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.

ఫోన్‌లో మాట్లాడిన 48 గంటల లోపే మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు మల్కపేట రిజర్వాయర్, పంప్ హౌస్, కంట్రోల్ రూం ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
బోయినపల్లి మండలంలోని మిడ్ మానేర్ నుంచి ఈ రోజు 0.5 టీఎంసీ నీటి విడుదల తర్వాత, ఈ నీరు మల్కపేట రిజర్వాయర్‌కు చేరుకున్న వెంటనే, దీని పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు, సింగసముద్రం చెరువులకు చేరనున్నాయి.