బలగం టీవీ, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలం, డబాబీ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా ముగిశాయి. బీఆర్ఎస్ మరియు బీజేపీ అభ్యర్థులకు సమాన సంఖ్యలో ఓట్లు రావడంతో, విజేతను నిర్ణయించడానికి అధికారులు టాస్ వేయాల్సి వచ్చింది. ఈ టాస్‌లో అదృష్టం బీఆర్ఎస్ అభ్యర్థిని వరించింది.
వివరాల్లోకి వెళితే… డబాబీ గ్రామ పంచాయితీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా, బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఈశ్వర్‌కు, బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి సరిగ్గా 175 ఓట్లు చొప్పున వచ్చాయి. ఇద్దరికీ సమాన ఓట్లు రావడంతో, ఎవరిని విజేతగా ప్రకటించాలో తెలియక అధికారులు కొద్దిసేపు తటపటాయించారు. అనంతరం, ఎన్నికల నిబంధనల మేరకు, ఇరు పార్టీల అభ్యర్థులు మరియు ఏజెంట్ల సమక్షంలో టాస్ వేయాలని నిర్ణయించారు. టాస్ వేయగా, అది బీఆర్ఎస్ అభ్యర్థి ఈశ్వర్ కు అనుకూలంగా వచ్చింది. దీంతో, టాస్ ద్వారా గెలుపొందిన ఈశ్వర్‌ను డబాబీ గ్రామ సర్పంచ్‌గా అధికారులు ప్రకటించారు.
