సిరిసిల్ల న్యూస్: వేములవాడ
బి.ఆర్.ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించబోయే యువజన సమ్మేళనం కార్యక్రమ సన్నాహకల్లో భాగంగా బుధవారం వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావులు విద్యార్థి, యువజన విభాగం నాయకులతో చర్చించారు. ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేసేందుకు విద్యార్థి, యువజన విభాగం నాయకులు కలసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ అరుణ-రాఘవ రెడ్డి, కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, మంద రాజేందర్, వనపట్ల సందీప్ రెడ్డి, నరేష్ పటేల్, అజయ్, పోతు అనిల్, బూర రాజశేఖర్, ముష్ణం జీవన్ గౌడ్, కడతాల వెంకటేష్, జిల్లా రాజు, ఉపేందర్,రాజేష్, చక్రాల వేణు, కసార్ల అరుణ్ కుమార్, పర్వతాల అంజి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.