సిరిసిల్ల న్యూస్:
సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు యాదవ్ ప్రెస్ మీట్….
// మీడియా సమావేశంలో జక్కుల కామెంట్స్ //
ఎల్లారెడ్డిపేటలో ఈనెల 6న జరిగే యువ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
యువ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.బిఆర్ఎస్ విద్యార్థి విభాగం యూత్ ఇంచార్జ్ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు యాదవ్…
తెలంగాణ ఉద్యమకారుడు,విద్యార్థి విభాగం నాయకులు యూత్ ఇంచార్జ్ జక్కుల నాగరాజ్ యాదవ్ బిఆర్ఎస్ యూత్ సీనియర్ నాయకులతో కలిసి సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం…
ఈ నెల 6 వ తేదీన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో యువ ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహిస్తున్నామని జక్కుల నాగరాజు మీడియా సమావేశం లో తెలిపారు.
ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేటీఆర్ వస్తున్నట్లు పేర్కొన్న నాగరాజు …
ఐదు మండలాలు తంగళ్ళపల్లి,ముస్తాబాద్, గంభీరావుపేట్,వీర్నపల్లి,ఎల్లారెడ్డిపేట నుంచి పెద్ద ఎత్తున యువకులు కదిలి వచ్చి యువ ఆత్మీయ సమ్మేళనం ను విజయవంతం చేయాలని యువకులను కోరిన నాగరాజు…
కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే అయిన తర్వాతనే సిరిసిల్ల ముఖచిత్రం మారి,ఉరి సాలగా ఉన్న సిరిసిల్ల ను సిరుల జిల్లా గా మార్చిన కేటీఆర్ ను లక్షకు పైగా మెజార్టీతో గెలిపించుకుంటామని మాట్లాడిన నాగరాజు…
ఒకప్పుడు ఒకే డిగ్రీ కాలేజ్ ఉన్న సిరిసిల్ల ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చి మెడికల్ కాలేజ్, జెఎన్టియు కాలేజ్,అగ్రికల్చర్ కాలేజ్, నర్సింగ్ కాలేజీ లతో పాటు యువకులను దృష్టిలో పెట్టుకొని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ మంత్రి కేటీఆర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు…
త్వరలోనే సిరిసిల్ల కు ఫిషరీస్ యూనివర్సిటీ కూడా రాబోతుంది అని తెలిపారు.
ఈరోజు ప్రతి చేనేత కార్మికునికి చేతిలో పని ఉందంటే దానికి కారణం కేటీఆర్ అని నాగరాజు అన్నారు.
ప్రతి మండలాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన కేటీఆర్ కు బహుమతిగా భారీ మెజార్టీతో గెలిపించుకోని కెసిఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేద్దామని అన్నారు.
కేటీఆర్ ఐటీ మంత్రిగా ప్రపంచ దేశాలు తిరిగి వేలాది కంపెనీలను తెలంగాణ కు తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగాలు సృష్టించిన ఘనత కేటీఆర్ ది అని అన్నారు..
ఎల్లారెడ్డిపేటలో నిర్వహించబోతున్న ఆత్మీయ సభ ద్వారా మంత్రి కేటీఆర్ కు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క యువకుడు స్వాగతం పలికి సభను విజయవంతం చేద్దామని తెలిపారు…
ఈ సమావేశంలో యూత్ నాయకులు జక్కుల నాగరాజు యాదవ్,గడ్డమీది శ్రీకాంత్ రెడ్డి,మెంగని మనోహర్,సింగారం దేవరాజు,కొత్త సంతోష్ గౌడ్,చీమల ప్రశాంత్ యాదవ్,షేక్ సికిందర్,ఆఫ్రోజ్ శీలం స్వామి,రవి,సాయి కిరణ్,కాసర్ల పవన్,ఆంటోని,నెరేళ్ల అనిల్,సాయి సూర్య,ఏగుర్ల కనకరాజు,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
