బలగం టీవీ, హైదరాబాద్, జూలై 4:
హైదరాబాద్‌లోని బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఐటీసీ కంపెనీలో శుక్రవారం జరిగిన యూనియన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం, తెలంగాణ రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ (బీఆర్‌టీయూ) ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అనుబంధ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్‌టీయూసీ)పై బీఆర్‌టీయూ స్పష్టమైన మెజారిటీతో గెలుపొందింది.
