డయాబెటిస్ ఉన్నవారి లైంగిక సామర్థ్యం తగ్గుతుందా..?ఈ విషయాలు తెలుుకోండి

0
165

మధుమేహం లేదా డయాబెటిస్ అనేది ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న జీవనశైలి వ్యాధుల్లో ప్రమాదకరమైనది. ఈ వ్యాధి రిస్క్ ఇటీవల కాలంలో బాగా పెరిగింది. రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో లేని పరిస్థితిని మధుమేహం అంటారు. ఈ సమస్య ఉన్న షుగర్ పేషెంట్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా చాపకింద నీరులా శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. మధుమేహం కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందో పరిశీలిద్దాం.

డయాబెటిస్ కారణంగా రక్తంలో షుగర్ లెవల్స్(Sugar levels) అధికంగా ఉంటే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా చర్మం మార్పులు, జుట్టు రాలడం, కంటి సమస్యల రిస్క్ పెరుగుతుంది. మధుమేహం ఉన్న చాలా మంది వ్యక్తుల్లో రెటినోపతి, శుక్లం సమస్యలు సాధారణం. వీటికి సకాలంలో తగిన చికిత్స తీసుకోకపోతే దృష్టి లోపం లేదా అంధత్వానికి దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • అంతర్గత ఆరోగ్య సమస్యలు

షుగర్ వ్యాధి శరీర అంతర్గత ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నోటిలో మంట వంటి అసౌకర్య పరిస్థితులు తలెత్తవచ్చు. ఈ సమస్య రోగనిరోధక శక్తి లోపించడానికి సంకేంతం. దీంతో ఇన్ఫెక్షన్స్ సోకే రిస్క్ పెరుగుతుంది. గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ డ్యామేజ్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.

  • ఎముకల క్షీణత

మధుమేహం ఉన్న వారిలో ఎముకలు బలహీనంగా మారే అవకాశం ఉంది. మధుమేహంతో ముడిపడి ఉన్న ఊబకాయం కారణంగా ఎముకలపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్‌కు దారితీయవచ్చు. ఇన్సులిన్ లెవల్స్ హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ఎముక జీవక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో ఎముక క్షీణత, ఎముక సాంద్రత తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం కొల్లాజెన్‌లో అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ (AGEs) లెవల్స్ పెంచుతుంది. ఇది ఎముక నాణ్యత ప్రతికూలం ప్రభావం చూపుతుంది.

  • కీళ్లపై ప్రతికూల ప్రభావం

మధుమేహం సోకిన వారి కీళ్లలో అసౌకర్యం లేదా దృఢత్వం సన్నగిల్లవచ్చు. కీళ్ల కదలిక, కీళ్ల వాపు వంటి సమస్యలకు ఇది దారితీయవచ్చు. చేతులు, కాళ్లలో సూదులతో గుచ్చినట్లుగా అనిపింవచ్చు.

  • కండరాల బలహీనత

డయాబెటిస్ కండరాల బలహీనతకు దారితీస్తుంది. రోజువారీ యాక్టివిటిస్ చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆస్టియోపెనియా, బోలు ఎముకల వ్యాధి వంటి రిస్క్ పెరుగుతుంది. దీంతో ఎముకలు పెలుసులా మారి పగుళ్లు వచ్చే అవకాశం ఉంది.

  • పురుషుల్లో లైంగిక సామర్థ్యం క్షీణత

పురుషుల లైంగిక సామర్థ్యం డయాబెటిస్ కారణంగా క్షీణిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రధానంగా అంగస్తంభన లోపాలు, అకాల స్కలనం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇవి చివరికి దాంపత్య జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

  • నియంత్రణ మార్గాలు

డయాబెటిస్‌ను మేనేజ్ చేయడమంటే కేవలం రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడం మాత్రమే కాక.. కండరాలు, ఎముకలు, కీళ్ల సంబంధిత కణజాలాలతో సహా శరీరం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లాంటిదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలోని జటిలమైన కనెక్షన్‌లను అర్థం చేసుకోవడం ద్వారా వ్యక్తులు తమ అవయవాలు, కణజాలాలకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా పర్యవేక్షణ, సమతుల్య ఆహారం, శారీరక శ్రమ, మెడిసిన్ అనేవి మధుమేహ నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయి. ఫలితంగా జీవన నాణ్యతను మెరుగుపర్చుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here