అభ్యర్థులు ఖర్చుల నమోదులో తేడాలు లేకుండా చూసుకోవాలి: ఎన్నికల సాధారణ పరిశీలకులుగా డాక్టర్ జగదీష్ సొన్ కర్

0
176

బలగం టివి:


వేములవాడ, సిరిసిల్ల 21, నవంబర్ 2023

ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చుల నమోదులో తేడాలు లేకుండా చూసుకోవాలనీ ఎన్నికల సాధారణ పరిశీలకులుగా డాక్టర్ జగదీష్ సొన్ కర్ (Dr.Jagdish sonkar) సూచించారు.

మంగళవారం సిరిసిల్ల, వేములవాడ రిటర్నింగ్ అధికారి కార్యాలయాలలో ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థుల రోజువారి అకౌంట్ ల రెండవ తనిఖీని
సాధారణ పరిశీలకులుగా డాక్టర్ జగదీష్ సొన్ కర్ ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు, ఎన్నికల వ్యయ పరిశీలకులు జి. మణిగండసామి తో కలిసి చేపట్టారు.
అభ్యర్థుల అకౌంటు పుస్తకాలు ,ఓచర్లు, బిల్లులను తగు వివరాలతో పరిశీలించారు.

క్రిమినల్ ఆంటిసిడెంట్స్ , సి -విజిల్, సువిధ , ఎంసీఏంసి తదితర అంశాల గురించి కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు, వారి ఏజెంట్లు అడిగిన సందేహాలను పరిశీలకులు నివృత్తి చేశారు.

సమావేశంలో రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్, మధు సూదన్, జిల్లా వ్యయ పర్యవేక్షణ కమిటీ ప్రత్యేక అధికారిని స్వప్న, నోడల్‌ అధికారి రామ కృష్ణ, లైజన్ అధికారి నర్సింహులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here