బలగం టీవీ, ఎల్లారెడ్డిపేట :
ఎల్లారెడ్డిపేట మండలం బాకూర్ పల్లి తండాలో ఓ వ్యక్తి ఇద్దరిని చితకబాది చంపుతానని బెదిరించాడని బాధితుల ఫిర్యాదు మేరకు గురువారం రోజు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. తండాకు చెందిన అజ్మీర రాంసింగ్ అనే వ్యక్తి గ్రామంలో వాటర్ ట్యాంక్ నుంచి కెనాల్ వరకు ప్రభుత్వ పరిమిషన్తో సిసి రోడ్డు వేశాడు. ఇందుకు అదే గ్రామానికి చెందిన అజ్మీర రాజు అనే వ్యక్తి నా పొలం వద్ద నుంచి సిసి రోడ్డు ఎందుకు వేశావని రామ్ సింగ్ ను ప్రశ్నిస్తున్న క్రమంలో రాంసింగ్ భార్య లక్ష్మి అతని కుమారుడు సాయి కుమార్ లు అడ్డువెల్లగా వారిని నాన్న బూతులు తిడుతూ చేతులతో కొట్టి చంపుతానని బెదిరించాడని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.