బలగం టీవీ, ఎల్లారెడ్డిపేట :
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గొర్రె పొట్టేలు చోరీకి గురైనట్లు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. వారి వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మిరియాల్కర్ ఐలోజు, రాజేష్ ల సంబంధించిన 5 గొర్రె పొట్టేలు ఈనెల 4వ తారీఖున సాయంత్రం 6 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.