బలగం టివి, ముస్తాబాద్
*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐదు సిసి కెమెరాలను ప్రారంభించి, కెమెరాలని ఏర్పాటు చేసినందుకు గ్రామ సభ్యులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానని పేర్కొన్నారు.సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియత్రించవచ్చని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి గ్రామంలో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నేరాలను అదుపు చేయవచ్చని,దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని,ఒకవేళ దొంగతనం జరిగినా సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పెట్టుకోవచ్చని చెప్పారు.నిఘా నేత్రాల నీడలో నేరాల నియంత్రణపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రజల రక్షణ భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పనిచేయడం జరుగుతుందన్నారు. సీసీ కెమెరాలు ఉంటే గ్రామంలలో, కాలనీ లలో ప్రజలకు రక్షణగా సెక్యూరిటీగా 24X7 పనిచేస్తాయని తెలిపారు. ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి సిసి కెమెరాలను ఎంతోగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంల ఎస్పీ వెంట సి.ఐ సదన్ కుమార్,ఎస్.ఐ శేఖర్ రెడ్డి ,గ్రామసభ్యులు తదితరులు ఉన్నారు.