ఎల్లారెడ్డిపేటలో నిర్మాణంలో ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని పరిశీలించిన ప్రముఖులు..

0
79

బలగం టీవీ, ఎల్లారెడ్డిపేట:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గౌడ కులస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులను శనివారం పలువురు ప్రముఖులు సందర్శించి పరిశీలించారు. ఆలయ నిర్మాణ దశలను మరియు పనుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, దైవ కార్యాల్లో భాగస్వాములు కావడం సంతోషకరమని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న,సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, మాజి ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్ ఎలగందుల నరసింహులు, పలువురు ప్రజా ప్రతినిధులు మరియు గౌడ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సంఘ సభ్యులు, గౌడ కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here