టీవీ9 సిరిసిల్ల రిపోర్టర్ ప్రసాద్ మృ*తి పట్ల ప్రముఖుల సంతాపం..

0
217

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

టీవీ9 సిరిసిల్ల రిపోర్టర్ ప్రసాద్ మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి..

సీనియర్ జర్నలిస్ట్, టీవీ9 సిరిసిల్ల రిపోర్టర్ ప్రసాద్ ఆకస్మిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన టివి9 రిపోర్టర్‌‌ ప్రసాద్ ఆకస్మిక మరణం పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన టివి9 రిపోర్టర్‌‌ ప్రసాద్ ఆకస్మిక మరణం పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సంతాపం తెలియజేశారు. తక్కువ వయసులో ప్రసాద్ గుండెపోటుతో హఠన్మరణం చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించిన కేటీఆర్, వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలియజేశారు.

సిరిసిల్ల టీవీ9 జర్నలిస్ట్ ప్రసాద్ ఆకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

చాలా చురుకైన జర్నలిస్టుగా పనిచేసిన ప్రసాద్ చిన్న వయసులోనే చనిపోవడం బాధించిందన్న కేంద్ర మంత్రి. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిరంతరం వార్తల కోసం పనిచేసే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ హఠాన్మరణం బాధాకరం.. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన టివి9 రిపోర్టర్‌‌ ప్రసాద్ ఆకస్మిక మరణం పట్ల రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రసాద్‌‌ మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటని, చిన్న వయస్సులో మరణించడం బాధాకరమన్నారు. వారు మీడియా రంగంలో పనిచేస్తూ జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ప్రజా సమస్యలను మీడియాతో పరిష్కరిస్తూ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు..

టీవీ9 రిపోర్టర్ సిరిసిల్ల, ప్రసాద్ మృతి మీడియా రంగానికి తీరని లోటు.. వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు

టీవీ9 రిపోర్టర్ గర్దాస్ ప్రసాద్ (45) ఈరోజు శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందడం మీడియా రంగానికి, వారి కుటుంబ సభ్యులకు తీరనిలోటు అని బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. గర్దాస్ ప్రసాద్ గత కొన్ని సంవత్సరాలుగా మీడియా రంగంలో పనిచేస్తూ సిరిసిల్ల జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. స్థానిక ప్రజలతోపాటు జిల్లాలోని అధికారులతో మంచికి మారుపేరుగా సత్సంబంధాలు కలిగి ప్రజా సమస్యలను మీడియాతో పరిష్కరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని, దురదృష్టవశాత్తు ప్రసాద్ ఈరోజు గుండెపోటుతో మృతి చెందడంతో చాలా బాధాకరమన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నామన్నారు.

జర్నలిస్టు ప్రసాద్‌‌ పార్టీవ దేహానికి నివాళులు..

జర్నలిస్టు ప్రసాద్‌‌ పార్టీవ దేహానికి బీఆర్ఎస్‌‌ నేతలు చీటీ నర్సింగరావు, జిందం చక్రపాణి, బొల్లి రాంమోహన్ తో పాటు జర్నలిస్టు సంఘాల నాయకులు, కాంగ్రెస్‍ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, పలువురు నాయకులు తదితరులు నివాళులు అర్పించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన టివి9 రిపోర్టర్ ప్రసాద్ ఆకస్మిక మరణం.. | Balagam Tv

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here