బలగం టీవి ..
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి.
సావిత్రి భాయి పూలే గారి జయంతి సందర్భంగా STUTS ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా ఉత్తమ మహిళ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి.
సావిత్రీ భాయి పూలే చిత్రపటానికి పూలమాల వేశారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్య మూర్తి సావిత్రి భాయి పూలే గారు అని కొనియాడారు. సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి విశేష కృషిచేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే గారు అని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని గత ప్రభుత్వంలో కెసిఆర్ గారు విద్య రంగానికి పెద్ద పీట వేశారు. మన ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు సకల సౌకర్యాలతో కార్పొరేట్ పాటశాలలకు ధీటుగా తయారు అయ్యాయి.
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, సెక్టరియల్ ఆఫీసర్స్ శైలజ, పద్మజ, STUTS అధ్యక్షులు లక్ష్మణ్, కార్యదర్శి సదానందం, ఉపాధ్యాయునిలు పాల్గొన్నారు
