సిరిసిల్ల న్యూస్: గంభీరావుపేట
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చక్రధర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముస్తాబాద్ మండలంకు చెందిన మాజీ ప్యాక్స్ చైర్మన్ చక్రధర్ రెడ్డి గత కొన్ని నెలల క్రితం బీ ఆర్ఎస్ కు రాజీనామా చేసి, అప్పటి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. గత కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్న చక్రధర్ రెడ్డి సోమవారం సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.