విలీన గ్రామాల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉంది..వేములవాడ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ

0
185

సిరిసిల్ల న్యూస్​:

విలీన గ్రామాల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉంది

గెలిచిన వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ

వేములవాడ మున్సిపల్ విలీన గ్రామాల్లో ఉన్న సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని, గెలిచిన వెంటనే సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు అన్నారు. గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా ఆదివారం జడ్పీ చైర్ పర్సన్ అరుణ-రాఘవ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డిలతో కలిసి వేములవాడ మున్సిపల్ విలీన గ్రామాలైన శాత్రాజుపల్లి 1,2,3 వార్డులతో పాటు నాంపల్లిలోని 5,6వ వార్డుల్లో పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయా వార్డుల్లోకి వెళ్లిన చల్మెడకు వార్డుల్లోని మహిళలు, యువకులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయా వార్డ్ ప్రజలను ఉద్దేశించి చల్మెడ మాట్లాడారు. విలీన గ్రామాల్లో ఉన్న ప్రజలకు ముఖ్యంగా రోడ్డు, డ్రైనేజీలు, కుల సంఘాల భవనాలు, మహిళ సంఘాల భవనాలు అవసరం ఉందని, బీడీ కార్మికుల పి.ఎఫ్ వంటి మహిళ సోదరీమణుల సమస్యలు స్థానిక ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని, తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అట్లాగే రాష్ట్రంలోని ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు సంక్రమంగా రావాలంటే మళ్ళీ ఒకసారి బి.ఆర్.ఎస్ పార్టీకి అధికారం ఇవ్వాలని, సీఎం కేసీఆర్ ను 3వ సారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు, ఎంపీపీ బండ మల్లేశం, ప్యాక్స్ చైర్మన్లు తిరుపతి రెడ్డి, సల్మాన్ రెడ్డి, కృష్ణ దేవరావు కౌన్సిలర్లు , జయ సలీం, నిమ్మశేట్టి విజయ్, జడల లక్ష్మి-శ్రీనివాస్, నీలం కల్యాణి-శేఖర్ , ఇప్పపూల అజయ్, సిరిగిరి రామచంద్రం, మారం కుమార్, కో-ఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్, సువర్ణ మల్లేశం, ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షులు అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here