బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
భీమారం మండలం గోవిందారం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మంగళవారం రోజు ప్రారంభం కాగా బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు గారు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. వారికి స్థానిక నాయకులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట మండల అధ్యక్షుడు సత్తిరెడ్డి సీనియర్ నాయకులు నెలుట్ల ప్రభాకర్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇరవేణి గంగాధర్ సీనియర్ నాయకులు తన్నీరు శ్రీనివాసరావు ఆదిరెడ్డి, మకిలి దాస్, సురేందర్ చీటీ దిలీప్ రావు, సతీష్, రాజుకుమార్, సురేష్ రావు తదితరులు పాల్గొన్నారు.
