బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు పోసు శ్రీనివాస్ కూతురు వివాహ వేడుక రుద్రంగి మండల కేంద్రంలోని శుభం గార్డెన్లో గురువారం జరుగగా ఈ వేడుకకు వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం,మాజీ ఎంపీపీ రంగం స్వరూప రాణిమహేష్, మాజీ సర్పంచ్ మాడిశెట్టి ఆనందం, మండల బిఆర్ఎస్ అధ్యక్షులు డేగవత్ తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షులు కమలాకర్, చెప్యాల గణేష్,మంచే రాజేశం,తలారి నరసయ్య, ఉప్పులూటి గణేష్, గెంటే ప్రశాంత్, గొళ్ళెం నర్సింగ్ ఆకుల గంగాధర్,రాజేశం, బాబా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.