సింగిల్ విండో వైస్ చైర్మన్ ను పరామర్శించిన చల్మెడ.

0
130

బలగం టీవీ, కరీంనగర్‌:

కథలాపూర్ మండలం భూషణ్ రావుపేటకు చెందిన సింగిల్ విండో వైస్ చైర్మన్ మిట్టపల్లి గంగారెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన గాయంతో కరీంనగర్‌లోని రెనే ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వేములవాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆసుపత్రికి విచ్చేసి గంగారెడ్డిని పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శతో గంగారెడ్డి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here