చంపాపేట్ స్వప్న హత్య కేసులో వీడిన మిస్టరీ.. తెరపైకి వివాహేతర సంబంధం

0
260

హైదరాబాద్ సమీపంలోని చంపాపేట్‌లో యువతి స్వప్న హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. భర్త ప్రేమ్ కుమారే ఆమెను హత్య చేశాడని తేల్చారు. ఈ హత్య కేసు శనివారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. స్వప్నను హత్య చేసిందెవరు? అన్నది మిస్టరీగా మారింది. 24 గంటల్లో పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు.

రిపోర్టుల ప్రకారం.. సతీష్ అనే యువకుణ్ని ఇదివరకు ప్రేమించిన స్వప్న.. ఆ తర్వాత టీస్టాల్ నడుపుతున్న ప్రేమ్‌కుమార్‌ని పెళ్లి చేసుకుంది. ఐతే.. పెళ్లి తర్వాత కూడా సతీష్ ఆమెతో స్నేహం కంటిన్యూ చేశాడు. ప్రేమ్ కుమార్ ఇంట్లో లేని సమయంలో అతను తరచుగా స్వప్న దగ్గరకు వస్తున్నాడు. దీనిపై స్వప్న – ప్రేమ్ కుమార్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

తాజాగా సతీష్ మరో యువకుణ్ని వెంటపెట్టుకొని.. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న స్వప్న దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన ప్రేమ్ కుమార్ ఆగ్రహంతో రగిలిపోయాడు. స్టెయిన్ లెస్ స్టీల్ కత్తితో.. స్వప్న మెడపై దాడి చేశాడు. దాంతో ఆమె చనిపోయింది. ఆ తర్వాత సతీష్, ప్రేమ్ కుమార్ మధ్య పెనుగులాట జరిగింది. ఆ పరిస్థితుల్లో ప్రేమ్ కుమార్.. పై నుంచి కింద పడ్డాడు. అతని తలకి బలమైన గాయం అయ్యింది. దాంతో సతీష్, అతని స్నేహితుడూ అక్కడి నుంచి పారిపోయారు.

ఏం జరిగిందో తెలియని స్థానికులు ప్రేమ్ కుమార్‌ని ఆస్పత్రిలో చేర్చి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్వప్న తండ్రి ఇచ్చిన కంప్లైంట్‌తో పోలీసులు కేసు రాసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్‌లో చాలా ఆధారాలు లభించాయి. ఐతే.. ప్రేమ్ కుమార్.. నిన్నంతా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. ఇవాళ అతను కోలుకోవడంతో.. అతని స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. తన భార్యతో సతీష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ప్రేమ్ కుమార్ ఆరోపించాడు. ప్రస్తుతం పోలీసులు సతీష్, అతని స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here