సిరిసిల్ల న్యూస్: వేములవాడ నియోజకవర్గం:
చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తాం అని ఏకగ్రీవ తీర్మానం
అది శ్రీనాన్నను ఎమ్మెల్యే గా గెలిపించుకుంటాం అని ముదిరాజ్ కుల బంధావులు హామీ
కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు ముదిరాజ్ సంఘ సభ్యులు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అది శ్రీనివాస్

వేములవాడ ఎమ్మెల్యేగా అది శ్రీనివాస్ ను గెలిపించుకుంటాం అని చందుర్తి మండల ముదిరాజ్ సంఘ సభ్యులు శుక్రవారం రోజున చందుర్తి మండల కేంద్రంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చందుర్తి మండల ముదిరాజ్ కుల సభ్యులు అందరూ కలసి నవంబర్ 30 నాడు జరిగే ఎన్నికల్లో చేతి గుర్తు పై ఓటు వేసి గెలిపిస్తాం అన్నారు.అధికార పార్టీ లో ఒక్క ముదిరాజ్ బిడ్డాకు కుడా ఎమ్మెల్యే సిటు ఇవ్వకుండా అవమానించారని అన్నారు..అది శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు సంపూర్ణ మద్దతు తెలిపిన చందుర్తి మండల ముదిరాజ్ సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. వేములవాడ నియోజకవర్గo ఏర్పడిన నాటి నుండి ఒక్క బీసీ బిడ్డా చట్ట సభల్లో అడుగు పెట్టలేదన్నారు.. ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని ఒక్క సారి ఓటు వేసి ఆశీర్వదించాలని అన్నారు..