తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మరుసటి క్షణం నుంచే పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు షురూ చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూలెక్కా పత్రాల్లేని నగదు, బంగారం, మద్యాన్ని సీజ్ చేస్తున్నారు. మరోవైపు అనుమానంగా కనిపిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల వాహనాలు కూడా వదలకుండా తనిఖీలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కారును రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండలం పెద్దమ్మ చెక్ పోస్టు వద్ద పోలీసులు కారు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీ అనంతరం గోవర్ధన్ అక్కడ నుంచి బయలుదేరి వెళ్లిపోయారు.