బలగం టివి, తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరేళ్ల గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాసుగంటి రాజు మాట్లాడుతూ సమ సమాజ స్వాప్నికుడు స్వయంగా రాజుగా ఎదిగాడని చత్రపతి శివాజీని కొనియాడారు. శివాజీ జయంతి సందర్భంగా అనంతరం గ్రామంలోని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రాగుల బాలయ్య కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని శివాజీ యూత్ సభ్యులు వితరణ చేశారు.
