బలగం టీవీ, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా రైతాంగం చిరకాల స్వప్నం సాకారమైంది. ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హతిఘాట్ వద్ద నిర్మించిన చనాక-కొరాటా బ్యారేజ్ పంప్‌హౌస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం లోయర్ పెనుగంగ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసి, సాగునీటి పంపిణీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. పంప్‌హౌస్ మోటార్లను స్విచ్ ఆన్ చేసి ముఖ్యమంత్రి నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, లొక్‌సభ సభ్యులు గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
