బలగం టివి, సిరిసిల్ల :
సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ లో కుసుమరామయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు రచించిన సిరిసిల్ల సిరిమల్లెలు పుస్తకానికి బాలల ప్రతిభా పురస్కారం 2023 దక్కింది. ప్రతి సంవత్సరం చదువుతోపాటు ఇతర కలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముస్తాబాద్ లో నీ డాక్టర్ చింతోజు బ్రహ్మయ్య- బాలమణి మెమోరియల్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి ఏటా బాలల ప్రతిభ పురస్కారాన్ని అందజేస్తుంది. ఈ సంవత్సరం కుసుమ రామయ్య జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రచించిన సిరిసిల్ల సిరిమల్లెలు పుస్తకానికి బాల ప్రతిభ పురస్కారం 2023 అవార్డును ప్రకటించారు. విద్యార్థులకునగదు పారితోషికం తో పాటు. ప్రశంసా పత్రాలు ఉపాధ్యాయులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం మోతిలాల్ , ప్రముఖ కవి రచయిత కవి గర్రెపల్లి అశోక్, ఉపాధ్యాయులుపాతూరు మహేందర్ రెడ్డి,పాకాల శంకర్,మల్లార పు పురుషోత్తం,రవీందర్, కుమ్మరి మల్లేశం, దేవత ప్రభాకర్, గోవిందరావు, సమ్మయ్య, నారాయణ,అజయ్, వెంకటేశం, సాంబయ్య లక్ష్మయ్య,నజీర్,సంధ్యారాణి, సరిత,నీరజ ఫాతిమా,సూర్య కళ, రజిత తదితరులు పాల్గొన్నారు.