బలగం టివి, రాజన్న సిరిసిల్ల

తెలంగాణ రచయితల వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కవితలు కథలు పాటలపై బాలలకు కార్యశాల కుసుమ రామయ్య బాలల ఉన్నత పాఠశాల సిరిసిల్లలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షులు జూకంటి జగన్నాథం మాట్లాడుతూ నేటి తరం బాలల్లో సామాజిక స్పృహ లోపించిందని గత తరానికి నేటితరానికి వారధి నెలకొల్పేదే సాహిత్య ప్రక్రియ అని అన్నారు. విద్యార్థులు సామాజిక అంశాలను ఎన్నుకొని కథలు కవితలు పాటలు రాయాలని సూచించారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి, నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ ఎడిటర్ పత్తిపాక మోహన్ ఈ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థానానికి చేరుకున్నారని అన్నారు వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని పిల్లలను కోరారు. చిన్నతనం నుండి పిల్లల్లో సాహిత్య అభిరుచి కలిగించాలని వారు కథలు కవితలు పాటలు ఎలా రాయాలో ఈ కార్యశాలలో బోధించడం జరుగుతుందని అన్నారు. కథలపై గరిపెల్ల అశోక్ , కవిత్వంపై బూర్ల వెంకటేశ్వర్లు మరియు అన్నవరం దేవేందర్, పాటలపై వెంగలి నాగరాజు తరగతుల్ని బోధించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆడేపు లక్ష్మణ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాకాల శంకర్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు మోతిలాల్ స్టాఫ్ సెక్రటరీ మల్లారపు పురుషోత్తం తెలుగు ఉపాధ్యాయులు సమ్మయ్య శ్రీనివాసరెడ్డి, రజిత మొదలైన వారు పాల్గొన్నారు.