ఆరు గ్యారెంటీలతో ముందుకు
సిరిసిల్ల న్యూస్: చొప్పదండి నియోజకవర్గం:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దుండ్రపల్లి, బూర్గుపల్లి, స్థంభంపల్లి, గుండన్నపల్లి గ్రామమాలలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెల్లి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా మద్దత్తు ఇవ్వాలని కోరారు.
మేడిపల్లి సత్యం మాట్లాడుతూ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని,500 రూపాయలకే సిలిండర్ అందిస్తామన్నారు.ఇందిరమ్మ పక్క ఇళ్ల పథకం కింద ఇల్లు లేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 6 లక్షల రూపాయలు అందజేస్తామని అన్నారు. మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని,
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెల 2500 రూపాయలు ఖాతాలో జమ చేస్తామని అన్నారు.చేయూత పథకం ద్వారా 4000 0రూపాయల పింఛన్ అందజేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, బోయినిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి,కరీంనగర్ జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు కర్ర సత్యప్రసన్న రెడ్డి, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మి పతి గౌడ్, తడగొండ ఎంపీటీసీ ఉయ్యాలా శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగుల కనుకయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీంరెడ్డి మహేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు ఎండీ బాబు, బోయిని ఎల్లేష్, గంగిపెల్లి లచ్చయ్య, కందుల శ్రీనివాస్ రెడ్డి, జంగం పర్శరాం, సంపత్, మల్లేశం, మల్లయ్య, శంకర్, వేణు, పిట్టల మోహన్, నల్ల మోహన్, గుడి శేఖర్ రెడ్డి, ఎండీ హుస్సేన్, సాన సత్యం, పెండ్యాల శ్రీనివాస్ రెడ్డి, కత్తెరపాక శ్రీనివాస్, సతీష్, కనుకయ్య, కొప్పుల మధు, నగేష్, వెంకటేష్, మహేందర్, కట్ట బాబు యువజన కాంగ్రెస్ నాయకులు కౌడగాని వెంకటేష్, నాగుల వంశీ గౌడ్, నిమ్మ వినోద్ రెడ్డి, దయ్యలా రాజశేఖర్, గడ్డి కమలాకర్, మెరుపుల మహేందర్, నక్క శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.