బలగం టివి, బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల పత్రిక విలేఖరులు బుధవారం రోజున చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను కరీంనగర్ తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, బొకే అందజేశారు. ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం గెలిసిన సందర్భంగా పత్రిక విలేఖర్లు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, నిజం మరియు ముద్ర విలేఖరి కూస రవి, గమనం పత్రిక విలేఖరి మైలారం మహేష్, గ్రామ సీమ పత్రిక విలేఖరి గూడ రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిమ్మ వినోద్ రెడ్డి, దుడ్డేల సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.