బలగం టీవి: వేములవాడ
కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా ఎన్నికైన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పౌర సన్మాన కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు నేరెళ్ల తిరుమల గౌడ్, జన సమితి జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకయ్య ఆహ్వాన కమిటీ సభ్యులు మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామీ, కౌన్సిలర్ బింగి మహేష్, మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్మహకులు మధు మహేష్, కాంగ్రెస్ నేతలు భారీగా ప్రజలు పాల్గొన్నారు..