బలగం టీవి, ఎల్లారెడ్డిపేట :
ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవని, ఇంటి ఆవరణతోపాటు, గ్రామం పరిశుభ్రంగా ఉంచాలనీ పరిశుభ్రతోనే ఆరోగ్యం సాధ్యమని వాలంటీర్లు రోడ్లు శుభ్రం చేయడం అభినందనీయమనీ రాజన్నపేట గ్రామ సర్పంచ్ ముక్క శంకర్ అన్నారు. మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల యెల్లారెడ్డిపేటకు చెందిన జాతీయ సేవా పథకం ప్రత్యేక శీతాకాల శిబిరం ఆధ్వర్యంలో 4వ రోజులో భాగంగా వాలంటీర్లు రాజన్నపేట గ్రామంలో ప్రధాన రహదారిపై గ్రామపంచాయతీ నుంచి యాదవ్ కాలనీ వరకు అరకిలోమీటరుకు పైగా చీపుర్లతో ఊడ్చి శుభ్రం చేశారు.ఈసందర్భంగా రాజన్నపేట గ్రామ సర్పంచ్ ముక్క శంకర్ మాట్లాడుతూ 13నుండి ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు గ్రామంలో శ్రమదానం, సేవాకార్యక్రమాలు చక్కగా చేస్తున్నారనీ, ప్రజలనుంచి మంచి స్పందన లభించిందనీ, పరిశుభ్రం చేయడం ద్వారా దోమలు, ఈగలు లేకుండా అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయనీ అన్నారు. వాలంటీర్లు చదువుతోపాటు సామాజికసేవలో పాల్గొనడం అభినందనీయమనీ, యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే ననీ అన్నారు.
జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ నాలుగు రోజులుగా గ్రామ సర్పంచ్ గ్రామస్తుల సహకారం తోనే ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు చురుకుగా పాల్గొంటున్నారని ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నవారు ఎక్కడైనా ఆత్మస్థైర్యంతో, చురుకుగా ఉంటారని సేవాభావం కలిగి ఉంటారని అన్నారు.
ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముక్క శంకర్,జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు, లెక్షరర్స్ నీరటి విష్ణు ప్రసాద్ ,కొడిముంజ సాగర్, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.