ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా నివారించవచ్చు.
ప్రతి వాహనదారుడు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంతోనే ఆరైవ్-ఆలైవ్ కార్యక్రమం.
సిరిసిల్ల,వేములవాడ పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.
- జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
స్పష్టమైన దృష్టి,నియంత్రిత వేగం,ట్రాఫిక్ నిబంధనల పాటింపు ద్వారా ప్రమాదాలను గణనీయంగా నివారించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.
శనివారం రోజు సిరిసిల్ల,వేములవాడ పోలీసుల ఆధ్వర్యంలో కాత్యాయని,ఎల్.వి ప్రసాద్ హాస్పిటల్స్ సిరిసిల్ల,లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ, మాతృ శ్రీ ,శ్రీ వర్ష కంటి హాస్పిటల్స్ వేములవాడ వారి సహకారంతో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రారంభించి,పరీక్షల అనంతరం అవసరమైన వారికి జిల్లా ఎస్పీ గారు కంటి అద్దాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరైవ్-ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల,వేములవాడ పట్టణాల్లో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశామని,రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమన్నారు. వయస్సు పెరిగే కొద్ది కంటి చూపు మందగించడం సహజమని, ముఖ్యంగా ప్రజలను తరలించే ప్యాసింజర్ వాహనాలకు చెందిన డ్రైవర్లు తమ కంటి చూపుపై మరింత శ్రద్ధ వహించాలని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి గమ్య స్థాలను క్షేమంగా చేరవేయాల్సిన బాధ్యత డ్రైవర్లపై వుందన్నారు.
ముఖ్యంగా కంటి చూపుతో బాధపడే వారు వాహనం నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అస్కారం అధికమని, రోడ్డు ప్రమాదాల నివారణకై డ్రైవర్లు సైతం నిరంతం కంటి పరీక్షలు నిర్వహించుకోవడం క్షేమకరమన్నారు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని,ద్విచక్ర వాహనం నడిపే సందర్భల్లో తప్పక హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడింగ్, ర్యాష్ డ్రైవింగ్,సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కాత్యాయని,ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్స్ సిరిసిల్ల వారికి ,లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ,మాతృ శ్రీ హాస్పిటల్, శ్రీ వర్ష కంటి హాస్పిటల్స్ వేములవాడ వారికి జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్పీ వెంట వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, డిఎస్పీ నాగేంద్రచారి, ఇన్స్పెక్టర్ లు కృష్ణ,వీరప్రసాద్, ఎస్.ఐ లు,డాక్టర్ చికోటి సంతోష్, లయన్స్ క్లబ్ సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు.




