సీఎం రేవంత్ రెడ్డి గారితో ఆర్బీఐ మాజీ గవర్నర్ శ్రీ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్, సీఎం శ్రీ రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టివిక్రమార్క, శాసన వ్యవహారాలు, ఐటీ శాఖల మంత్రి శ్రీ శ్రీధర్ బాబు, సీఎస్ శ్రీమతి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి శ్రీ శేషాద్రి పాల్గొన్నారు.