పతాక దినోత్సవ నిధికి చెక్ అందజేత
బలగం టీవీ, హైదరాబాద్:
సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి (Armed Forces Flag Day Fund – AFFDF) కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 లక్ష రూపాయల విరాళం అందించారు. సాయుధ దళాల పతాక దినోత్సవం (డిసెంబర్ 7) పురస్కరించుకుని తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టరేట్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బోల్డ్ అండ్ బ్రేవ్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్, కెప్టెన్ శ్రీనేష్ కుమార్, కెప్టెన్ నరోత్తమ్ రెడ్డి, కెప్టెన్ శ్రీనివాసులు తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.
