యాసంగి పంటకు సాగునీరు విడుదల
నిర్మల్ జిల్లాలోని మామడ మండలం పొన్కల్ గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన సదర్మట్ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యారేజీ గేట్లను ఎత్తి, యాసంగి పంట సాగు కోసం అధికారికంగా నీటిని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీ జి. నగేష్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

