సిఎం రేవంత్ రెడ్డి బాష తెలంగాణ సమాజం తలదించుకునే విధంగా ఉంది.
టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు..
బలగం టివి,గంభీరావుపేట : ఇంద్రవెల్లి, సచివాలయం సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన, తెలంగాణ ప్రదాత కెసిఆర్ పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు
అన్నారు.సోమవారం కెసిఆర్ పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ గంభీరావుపేట మండల కేంద్రంలో బీఅర్ఎస్ నాయకులు సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబోమ్మ దహానం చేశారు. చేపట్టారు.ఈ సందర్బంగా టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ సమాజం తలదించుకునే విధంగా రేవంత్ రెడ్డి భాష ఉన్నదని, ఇటువంటి బాషా దిగజారుడు రాజకీయం, చౌకబారు రాజకీయం చేసేఅసమర్థులు మాట్లాడతారని అన్నారు. రాదు అన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన వ్యక్తిని పట్టుకొని అసభ్యంగా మాట్లాడడం సీఎం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని అన్నారు. పరిపాలన దక్షత లేని వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అమలు కానీ హామీలు ఇచ్చి అధికారం లోకి కాంగ్రెస్ వచ్చిందని , ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు కాంగ్రెస్ నాయకుల్ని గ్రామాల్లో తిరగనివ్వనియ్యరని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి వెంటనే కెసిఆర్ కీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట స్వామి గౌడ్, జడ్పీ కో ఆప్షన్ హైమద్ నాయకులు రాజారాం,దయకర్ రావు,రాజీరెడ్డి,కమలాకర్ రెడ్డి,వెంకట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.