బలగం టివి: హైదరాబాద్:
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రస్తుత ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ లోని యశోద హస్పీటల్ లో పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ తో మాట్లాడారు. కేటీఆర్‌తో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి వివరాలను .. ఇంట్లో పడిపోయిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు,